- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. పాకిస్తాన్‌కు ఐర్లాండ్ షాక్
మలేసియాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి.

దిశ, స్పోర్ట్స్ : మలేసియాలో జరుగుతున్న మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌ను నైజీరియా ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్తాన్‌కు ఐర్లాండ్ షాకిచ్చింది. సూపర్-6 రౌండ్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ అద్భుతం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో(డీఎల్‌ఎస్ పద్ధతిలో) పాక్‌ను మట్టికరిపించి సూపర్-6కు అర్హత సాధించింది.
మరోవైపు, గ్రూపు దశలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని పాక్ తాజా ఓటమితో తర్వాతి రౌండ్ ఆశలను గల్లంతు చేసుకుంది. గతేడాది పాక్ సీనియర్ పురుషుల, మహిళల జట్లు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో గ్రూపు దశలోనే నిష్ర్కమించిన విషయం తెలిసిందే. మ్యాచ్ విషయానికొస్తే..ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో రెండు ఇన్నింగ్స్‌లను 9 ఓవర్లకు కుదించి మ్యాచ్‌ను నిర్వహించారు. టాస్ గెలిచి ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగగా.. ఆలిస్ వాల్ష్(31) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఆ జట్టు 9 ఓవర్లలో వికెట్లు కోల్పోయి 69 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో పాక్ చేతులెత్తేసింది. 9 ఓవర్లలో 59/7 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ కోమల్ ఖాన్(12) టాప్ స్కోరర్. ఎల్లీ మెక్‌గీ(2/13)కుతోడు ఇతర బౌలర్లు రాణించడంతో ఐర్లాండ్ విజయం సాధించింది. ఈ నెల 25న సూపర్-6 మ్యాచ్‌లో ఐర్లాండ్.. సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది.






