విండీస్‌ను చిత్తుచేసిన ఐర్లాండ్.. 124 పరుగుల తేడాతో ఘనవిజయం

by Phanindra |   (  Updated:2025-05-21 19:29:33  IST  )

విండీస్‌తో జరిగిన వన్డేలో ఐర్లాండ్ ఘనవిజయం సాధించింది. 124 పరుగుల తేడాతో విండీస్‌ను ఐర్లాండ్ చిత్తుచేసింది.

విండీస్‌ను చిత్తుచేసిన ఐర్లాండ్.. 124 పరుగుల తేడాతో ఘనవిజయం
X

దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్‌పై ఐర్లాండ్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ప్లేయర్లు ఆండీ బల్‌బిర్నీ (112), పాల్ స్టిర్లింగ్ (54), హ్యారీ టెక్టార్ (56), లోర్కాన్ టక్కర్ (30) అద్భుతంగా ఆడారు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్ 3 వికెట్లు, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లతో రాణించారు. ఛేజింగ్‌లో వెస్టిండీస్ తడబడింది. టాప్-5 బ్యాటర్లలో ఒక్క బ్రాండన్ కింగ్ (19) మాత్రమే రెండంకెల స్కోరు సాధించాడు.


ఇక చివర్లో జస్టిన్ గ్రీవ్స్ (35), రోస్టన్ ఛేజ్ (55), మాథ్యూ ఫోర్డ్ (38) కొంత పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో వెస్టిండీస్ 34.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్‌పై 124 పరుగులు ఘనవిజయంతో మూడు వన్డేల సిరీసులో ఐర్లాండ్ 1-0 ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్‌కార్తీ నాలుగు వికెట్లతో రాణించగా.. జార్జ్ డాక్రెల్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Next Story