- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్ చేతిలో భారత్ చిత్తు.. కాఫా నేషన్స్ కప్‌లో 3-0తో ఓటమి
ఇరాన్ చేతిలో భారత్ చిత్తుగా ఓడింది. కాఫా నేషన్స్ కప్‌లో 3-0తో ఓటమి చవిచూసింది.

దిశ, స్పోర్ట్స్: కాఫా (సీఏఎఫ్ఏ) నేషన్స్ కప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. ఇటీవలి కాలంలో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు.. తొలి మ్యాచ్‌లో 2-1 తేడాతో తజికిస్తాన్‌ను ఓడించి కాన్ఫిడెన్స్ సంపాదించింది. కానీ ఆసియాలో టాప్ టీం అయిన ఇరాన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం టీమిండియా తేలిపోయింది. ఏకంగా 3-0 తేడాతో చిత్తుగా ఓడింది. అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఇరాన్ 20వ స్థానంలో ఉండగా.. భారత్ 133వ ర్యాంక్‌లో ఉంది.
ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూసేందుకు కూడా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిచూపలేదు. పేలవ పాస్‌లు, చెత్త నిర్ణయాలే భారత్ కొంపముంచాయి. ఆరంభం నుంచే పేలవంగా ఆడిన భారత్.. 59వ నిమిషంలో తొలిగోల్ సమర్పించుకుంది. ఆ తర్వాత తీవ్రమైన ఒత్తిడికి గురై.. ఎలాగైనా స్కోర్ సమం చేయాలని తొందరపడింది. ఈ క్రమంలో ప్లేయర్లు బాగా అలసిపోయారు. అప్పుడు సురేష్ సింత్, డానిష్ ఫరూఖ్ స్థానంలో జీక్సన్ సింగ్, చింగ్లెన్సనా సింగ్‌ను కోచ్ ఖలీద్ జమీల్ తీసుకురావడం వ్యూహాత్మక తప్పిదంగా మారింది.
ఈ నిర్ణయంతో భారత మిడ్‌ఫీల్డ్ బ్యాలెన్స్ దెబ్బతిన్నది. దీన్ని యూజ్ చేసుకున్న ఇరాన్ 89వ నిమిషంలో మరో గోల్ చేసింది. పోస్ట్‌కు తగిలి తిరిగొచ్చిన బంతినిఅలీ అలిపోర్ఘరా గోల్‌గా మార్చాడు. చివర్లో ఇంజురీ టైంలో అలసిపోయిన భారత డిఫెన్స్‌ను పూర్తిగా చిన్నాభిన్నం చేసిన ఇరాన్ తెలివిగా మరో గోల్ చేసి 3-0తో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. భారత జట్టు సెప్టెంబరు 4న తదుపరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.






