- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్‌లో అంపైర్‌తో పెట్టుకుంటే అంతే.. నితీష్ రాణా కు భారీ జరిమానా
అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన నితీష్ రాణాపై ఐపీఎల్ యాజమాన్యం ఆగ్రహం! 25% మ్యాచ్ ఫీజు జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ టోర్నమెంట్‌లో రూల్స్ ను బీసీసీఐ ఎంతో కఠినతరం చేసింది. దీంతో అంపైర్లతో, తోటి ప్లేయర్లతో ఎవరైన దురుసుగా ప్రవర్తించినా.. రూల్స్ బ్రేక్ చేసిన వెంట వెంటనే భారీ జరిమానాలతో పాటు మ్యాచ్ సస్పెన్షన్లు కూడా జరుగుతున్నాయి. ఈ చర్యలకు చిన్నా పెద్ద ప్లేయర్లు అని తేడా ఉండదు. తాజాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) ఉల్లంఘించినందుకు భారీ జరిమానాకు గురయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ సందర్భంగా ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగడమే ఇందుకు కారణమైంది. ఐపీఎల్ లెవల్-1 నిబంధనల ప్రకారం అంపైర్ నిర్ణయాన్ని గౌరవించకపోవడం, వారితో వాదించడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. దీంతో మ్యాచ్ రిఫరీ నితీష్ రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అసలేం జరిగింది?
మ్యాచ్‌లోని ఒక కీలక సమయంలో డీఆర్‌ఎస్ (DRS) లేదా ఫీల్డ్ నిర్ణయానికి సంబంధించి నితీష్ రాణా ఫోర్త్ అంపైర్‌తో అసహనం వ్యక్తం చేస్తూ వాదించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంపైర్ల నిర్ణయమే ఫైనల్ అని, దానిపై మైదానంలో వాదించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. రాణా తన తప్పును అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ ఈ జరిమానాను ఖరారు చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఇలాంటి క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోగా, రాణా కూడా ఆ జాబితాలో చేరాడు.






