ఐపీఎల్-2024 ఫైనల్ తేదీ రివీల్?.. టైటిల్ పోరు ఎప్పుడంటే?

by Dishanational3 |
ఐపీఎల్-2024 ఫైనల్ తేదీ రివీల్?.. టైటిల్ పోరు ఎప్పుడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ఈ నెల 22 నుంచి ప్రారంభకానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలి దశలో భాగంగా 21 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పూర్తి షెడ్యూల్‌ రావాల్సి ఉంది. అయితే, తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) మెంటార్ గౌతమ్ గంభీర్ ఫైనల్ మ్యాచ్ తేదీపై హింట్ ఇచ్చాడు. ప్రాక్టీస్ సెషన్‌లో కేకేఆర్ ఆటగాళ్లతో గంభీర్ మాట్లాడుతూ.. మే 26 కోసం సిద్ధంగా ఉండాలని సూచించాడు. దీంతో మే 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

ప్రాక్టీస్ సెషన్‌లో గంభీర్ మాట్లాడుతున్న ఓ వీడియోను కేకేఆర్ శనివారం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో గంభీర్ మాట్లాడుతూ..‘మన లక్ష్యం ఒక్కటే. అదే ఐపీఎల్ గెలవడం. మే 26న మనం అక్కడ ఉండటానికి సాధ్యమయ్యే ప్రతి దాన్ని అందించాలి. తొలి మ్యాచ్ నుంచే అది మొదలవ్వాలి.’ అని గంభీర్ తెలిపాడు. గంభీర్ వ్యాఖ్యల బట్టి ఫైనల్ మ్యాచ్ మే 26న జరిగే అవకాశం ఉంది. అయితే, దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో బోర్డు ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌పై కసరత్తు మొదలుపెట్టిన తెలుస్తోంది. వారం రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.



Next Story

Most Viewed