IPL ఫైనల్.. IT కంపెనీలకు సెలవు

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL) సీజన్ తుది అంకానికి వచ్చేసింది.

IPL ఫైనల్.. IT కంపెనీలకు సెలవు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL) సీజన్ తుది అంకానికి వచ్చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) జట్ల మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరగనుంది. మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవనుండగా.. వర్షం పడే అవకాశాలు కూడా ఏమీ లేనట్టు IMD ప్రకటించింది. ఈసారి ఎలాగైనా కప్ గెలిచి అభిమానుల కోరిక నెరవేర్చాలని RCB పక్కా ప్లాన్స్ రెడీ చేసుకుంటోంది. ఇక ఐటీ నగరం బెంగుళూరు ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్లో మునిగిపోయింది.

తమ జట్టు 'కప్ నమ్దే ఈ సాలా' అని కప్పు కొడుతుందని గంపెడు ఆశలు పెట్టుకుంది. అయితే ఈ మ్యాచును ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చూసేందుకు బెంగుళూరులోని చాలా ఐటీ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. మరికొన్ని MNC కంపెనీలు తమ ఆఫీసుల్లోనే లైవ్ మ్యాచ్ తిలకించడానికి స్క్రీన్స్ ఏర్పాటు చేశాయి. మరి అభిమానులకు RCB గిఫ్ట్ ఇస్తుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.

Next Story