IPL 2025 : ఐపీఎల్ ఫైనల్.. త్రివిధ దళాలను ఆహ్వానించిన BCCI

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరగబోతోతున్న సంగతి తెలిసిందే.

IPL 2025 : ఐపీఎల్ ఫైనల్.. త్రివిధ దళాలను ఆహ్వానించిన BCCI
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరగబోతోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా BCCI దేశ త్రివిధ దళాల(Army, Navy, Air Force) అధికారులను, సైనికులను గౌరవించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి ఈ కార్యక్రమాన్ని అంకితం ఇవ్వనున్నారు.

వీరి కోసం స్టేడియంలో ప్రత్యేక స్టాండ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి పాటలు, సైనిక బ్యాండ్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రత్యేక కార్యక్రమ సమయంలో స్టేడియం మొత్తం జాతీయ భావనతో నిండిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor)లో మన సైనికులు గొప్ప విజయం సాధించిన దానికి గౌరవ వందనం సమర్పించడానికి ఐపీఎల్ ని ఒక వేదికగా ఎంచుకున్నట్టు బీసీసీఐ పేర్కొంది.

ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ కూడా కాస్త గందరగోళంగా సాగింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల(Bharat-Pak Conflicts) కారణంగా మే 9న టోర్నమెంట్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. తర్వాత మే 10న రెండు దేశాల మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగాక, మే 17 నుంచి టోర్నమెంట్ మళ్లీ మొదలైంది. ఇప్పుడు ఫైనల్‌లో ఈ గౌరవ వందన కార్యక్రమంతో BCCI మన సైనికులకు దేశం మొత్తం ముందు సలాం చేయబోతోంది.

Next Story