- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టికెట్ల పండుగ.. మే 20 నుంచి అమ్మకాలు షురూ
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయ షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఈసారి ప్లేఆఫ్స్ టికెటింగ్ భాగస్వామిగా (Official Ticketing Partner) ప్రసిద్ధ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు చెందిన ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ (District by Zomato) యాప్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ టికెట్ల విక్రయాలు మే 20, రాత్రి 7 గంటల నుంచి విడతల వారీగా ప్రారంభం కానున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా రూపే క్రెడిట్ కార్డ్ (RuPay Credit Card) కలిగిన అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణ ప్రజల కంటే 24 గంటల ముందే వీరు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. టికెట్లు కొనాలనుకునే అవారు ‘District by Zomato’ యాప్ లేదా వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిర్దేశిత సమయాల్లో తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, బుకింగ్ విండో ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయే అవకాశం ఉంది.






