- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : తన తమ్ముడు హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కృనాల్ పాండ్యా స్పష్టం చేశాడు. ఐపీఎల్-2026లో హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కృనాల్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ నెల 12న ఎంఐ, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అవుటైనప్పుడు కృనాల్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. హార్దిక్ కూడా అతని వైపు చూస్తూ డకౌట్‌కు వెళ్లాడు. దీంతో పాండ్యా సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కృనాల్ ఆ వార్తలను కొట్టిపారేశాడు. యాంకర్ ‘హార్దిక్‌తో అంతా బాగానే ఉందా? ఏదైనా గొడవ జరిగిందా?’అని అడగ్గా.. కృనాల్ నవ్వుతూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత అంతా బానే ఉందని సమాధానమిచ్చాడు. అలాగే, లక్నో సూపర్ జెయింట్స్ యువ బ్యాటర్ ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశానని వచ్చిన ఆరోపణలపై కూడా స్పందించాడు. తాను అతనితో సరదాగానే మాట్లాడనని, తమ మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. ‘నేను అతన్ని స్లెడ్జ్ చేయలేదు. అతనికి బౌలింగ్ చేసినప్పుడు తొలి బంతి ప్యాడ్స్‌కు తాకింది. అప్పుడు నేను అతనితో ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. లాంగ్ ఆన్ లేదా లాంగ్ ఆఫ్‌లో సిక్స్‌లు బాదగలవు. నా బౌలింగ్‌లో అలాగే కొట్టు’అని చెప్పా. ముకుల్ నవ్వుకున్నాడు. అదంతా సరదాగా జరిగింది. నా హెయిర్ స్టైల్ చూసి నేను చాలా సీరియస్‌గా, కోపంగా ఉంటానని అనుకుంటారు. కానీ, నేను అలా ఉండను.’అని కృనాల్ చెప్పుకొచ్చాడు.






