IPL 2026 Final: గుజరాత్‌కు ఝలక్.. అప్పుడే రెండు కీలక వికెట్లు డౌన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-31 14:26:53  IST  )

ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి.

IPL 2026 Final: గుజరాత్‌కు ఝలక్.. అప్పుడే రెండు కీలక వికెట్లు డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ముగింపు ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఫైనల్ సమరం ప్రారంభమైంది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుని, గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 3 ఓవర్లోనే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 12 బంతుల్లో 12 పరుగులు చేసి పర్పుల్ క్యాప్ హోల్డర్ భువనేశ్వర్ కుమార్‌కు చిక్కాడు ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ స్కోరు 3.4 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజ్‌లో నిషాంత్ సింధు, జోస్ బట్లర్ ఉన్నారు.

Next Story