- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధోనికి షాక్... CSK జట్టుకు కొత్త కెప్టెన్
ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad ) పేరును కెప్టెన్ గా అనౌన్స్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పెద్ద ప్లాన్ తోనే చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రవీంద్ర జడేజా లాంటి కీలక ప్లేయర్ ను వదిలేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ట్రేడ్ ట్రాక్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కొనుగోలు చేసింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు అధికారికంగా రావడంతో మరో కీలక ప్రకటన చేసింది యాజమాన్యం.
వచ్చే సీజన్ లో ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad ) పేరును కెప్టెన్ గా అనౌన్స్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. గత సీజన్ లో ధోనీనే కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ధోనికి వచ్చే సీజనే చివరిది అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరోసారి రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది చెన్నై.






