- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2026 : వేలంపై అప్‌డేట్.. ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుందో తెలుసా?
వచ్చే సీజన్ ఐపీఎల్‌కు సంబంధించిన వేలంపై అప్‌డేట్ వచ్చింది.

దిశ, స్పోర్ట్స్ : వచ్చే సీజన్ ఐపీఎల్‌కు సంబంధించిన వేలంపై అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్‌లో రెండో వారం లేదా మూడో వారంలో ఆక్షన్ జరగనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 13 నుంచి 15 మధ్య బీసీసీఐ వేలం ప్రక్రియను నిర్వహించనున్నట్టు సమాచారం. దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. వేలం వేదికపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్‌పై స్పష్టత రావాల్సి ఉంది. ప్లేయర్ల రిటెన్షన్‌కు బీసీసీఐ నవంబర్ 15వతేదీ డెడ్‌లైన్ పెట్టినట్టు సమాచారం. ఆ లోపు ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్లు, వదిలేస్తున్న ఆటగాళ్ల వివరాలను అందజేయాలని బోర్డు ఆదేశించినట్టు తెలుస్తోంది. గత రెండు సీజన్ల వేలం ప్రక్రియ విదేశాల్లో జరిగింది. 2023లో దుబాయ్‌లో నిర్వహించగా.. గతేడాది సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిర్వహించారు. ఈ సారి భారత్‌లోనే వేలం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంబైలో నిర్వహించాలని బోర్డు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. చెన్నయ్ సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.






