- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్-2026 మినీ వేలంలో ట్విస్ట్..తేదీ, వేదిక మార్పు!
ఐపిఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన ముంబైలో కాకుండా అబుదాబిలో

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ అభిమానులకు బిగ్ అలర్ట్. ఐపీఎల్ 2026 మినీ వేలానికి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముందు అందరూ అనుకున్నట్లుగా ముంబైలో కాకుండా అబుదాబిలో ఐపిఎల్ 2026 మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో కూడా విదేశాల్లోనే ఐపీఎల్ ఆక్షన్ ( IPL 2026 auction ) నిర్వహించింది బీసీసీఐ.
ఇప్పుడు ఇండియాలో ఎలాంటి సమస్యలు లేకున్నా, మరోసారి విదేశాల్లోనే వేలం నిర్వహించేందుకు సిద్ధమైందట. ఇక అటు ఈ సారి చాలా జట్లు కీలక ప్లేయర్లను వేలంలో వదిలేస్తున్నాయి. భయంకరమైన బ్యాటర్లతో పాటు బౌలర్లను రిలీజ్ చేస్తున్నాయి. దీంతో ఈ సారి వేలం చాలా ఆసక్తిగా మారనుందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. కాగా నవంబర్ 15వ తేదీ లోపు రిటెన్షన్ ప్రక్రియ ముగియనుంది. ప్రస్తుతం ట్రేడ్ ట్రాక్ ద్వారా ప్లేయర్లను మార్చుకుంటున్నారు.






