- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: ఆ మూడు జట్లపై దారుణమైన ట్రోల్స్
ఐపీఎల్ 2025 మెగా టోర్నమెంట్ కొనసాగుతోంది. 2025 సీజన్ కు ముందు మెగా వేలం జరగడంతో అన్ని జట్లలో కీలక ప్లేయర్లు మారిపోయారు. దీంతో ఆయా జట్లలోకి కొత్త ప్లేయర్లు వచ్చి చేరడంతో.. ఈ 18వ సీజన్ లో జట్ల ఆటతీరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 మెగా టోర్నమెంట్ (IPL mega tournament) కొనసాగుతోంది. 2025 సీజన్ కు ముందు మెగా వేలం (Mega Auction) జరగడంతో అన్ని జట్లలో కీలక ప్లేయర్లు మారిపోయారు. దీంతో ఆయా జట్లలోకి కొత్త ప్లేయర్లు వచ్చి చేరడంతో.. ఈ 18వ సీజన్ (Season 18) లో జట్ల ఆటతీరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఆర్సీబీ (RCB), కేకేఆర్ వంటి జట్లపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టు మొదటి మ్యాచులోనే 286 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరును నమోదు చేసుకుంది. దీంతో ఈ సీజన్ పై క్రికెట్ ప్రేమికులు పెట్టుకున్న అంచనాలను అందుకునేలా కనిపించాయి. కానీ.. 10 మ్యాచుల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
గత సీజన్ లో మొదటి విజయాన్ని అందుకోవడానికి తిప్పలు పడ్డ జట్లు ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో కొనసాగుతుండగా.. 5 ట్రోఫీలు ఉన్న చెన్నై, 5 ట్రోఫీలు ముంబై, రెండు ట్రోఫీలు ఉన్న హైదరాబాద్, మూడు ట్రోఫీలు ఉన్న కేకేఆర్ జట్లు ఈ సీజన్ లో విజయాల కోసం తీవ్రంగా కష్ట పడుతున్నాయి ముఖ్యంగా ముంబై, చెన్నై, హైదరాబాద్ జట్లు ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఐదేసి మ్యాచులు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచులోనే విజయం సాధించి నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలు అయ్యాయి. పాయింట్ల పట్టికలో ఈ మూడు కీలక జట్లు అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నాయి. దీంతో ఈ సీజన్ లో భారీ అంచనాలు ఉన్న జట్లు గెలుపు కోసం కష్టపడుతున్నాయని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ట్రోల్స్ భారీగా ఉన్నాయి. ఈ సీజన్ లో వైల్డ్ ఫైర్ (Wild fire) ఆట చూపిస్తామని ఈ సారి 300 స్కోర్ చేసి చరిత్ర సృష్టిస్తామనే లక్ష్యంగా బరిలోకి దిగగా.. మొదటి మ్యాచ్ మినహా.. మిగిలిన నాలుగు మ్యాచుల్లో సన్ రైజర్స్ దారుణంగా ఓడిపోయింది. దీంతో 300 తర్వాత గానీ.. ఫస్ట్ 200 స్కోర్ కొట్టి.. దానిని కాపాడుకోవాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇదే విధంగా చెన్నై, ముంబై జట్లను సైతం ట్రోల్ (troll) చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో మంచి ఫాన్ కనబరుస్తున్న ఢిల్లీ ఇంతవరకు ఒక్క మ్యాచులోను ఓడిపోలేదు. అలాగే గుజరాత్ జట్టు ఐదు మ్యాచుల్లో 4 విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఢిల్లీ మూడో స్థానంలో ఆర్సీబీ, నాలుగో స్థానంలో పంజాబ్, ఐదో స్థానంలో లక్నో జట్లు ఉన్నాయి.






