- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సన్‌రైజర్స్ జట్టులోకి వియాన్ మల్డర్
మల్డర్ ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

- గాయంతో దూరమైన బ్రైడన్ కార్స్
- కర్స్ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆల్‌రౌండర్
దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా ఐపీఎల్ 2025కి దూరమైన బ్రైడర్ కార్స్ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ మల్డర్‌ను తీసుకున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌లోని గఢాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బ్రైడన్ కార్స్ పాదానికి గాయం అయ్యింది. దీంతో అతడు ఇంగ్లాండ్ తరపున రెండు మ్యాచ్‌లు దూరమయ్యాడు. గాయం కారణంగా పాకిస్తాన్ నుంచి బ్రైడన్ లండన్‌కు తిరిగి వచ్చినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అంతే కాకుండా బ్రైడన్ స్థానంలో యువ స్పిన్నర్ రేహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే ప్లేయింగ్ ఎలెవెన్‌లో మాత్రం అతడి స్థానంలో జామీ ఓవర్టన్‌ను భర్తీ చేసింది. 2024 నవంబర్‌లో సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో సన్‌రైజర్స్ జట్టు రూ.1 కోటికి ఇంగ్లాండ్‌కు చెందిన బ్రైడన్ కార్స్‌ను కొనుగోలు చేసింది. కాగా, వియాన్ మల్డర్‌ను మెగా ఆక్షన్‌లో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ జట్టు రూ.75 లక్షలకు వియాన్‌ను బ్రైడర్ స్థానంలో తీసుకుంది. మల్డర్ ఇప్పటి వరకు 11 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో పాటు 18 టెస్టులు, 25 వన్డేల్లో సౌత్ ఆఫ్రికా తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు 60 వికెట్లు తీయడంతో పాటు 970 పరుగులు సాధించాడు. మల్డర్ ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.






