- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ షెడ్యూల్ అప్పుడే.. హైదరాబాద్‌లో ఆ మ్యాచ్‌లు?
మార్చి 21 నుంచి ఐపీఎల్-2025 సీజన్ మొదలవుతుందని ఇప్పటికే బీసీసీఐ ధ్రువీకరించింది.

దిశ, స్పోర్ట్స్ : మార్చి 21 నుంచి ఐపీఎల్-2025 సీజన్ మొదలవుతుందని ఇప్పటికే బీసీసీఐ ధ్రువీకరించింది. అయితే, ఇంకా షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే లీగ్ మొదలుకానుంది. మరో 38 రోజులు ఐపీఎల్‌కు తెరలేవనుండటంతో షెడ్యూల్‌పై బోర్డు కసరత్తు చేస్తున్నది. వచ్చే వారంలో లీగ్ షెడ్యూల్ విడుదల కానున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్ లీగ్‌ను ప్రారంభించడం ఆనవాయితీ. మార్చి 21న జరిగే ఓపెనింగ్ మ్యాచ్‌లో ఏ జట్టుతో కేకేఆర్ తలపడనుందో చూడాలి. అలాగే, వచ్చే సీజన్ ఫైనల్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్వాలిఫయర్ 2 కూడా కోల్‌కతాలోనే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇక, క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.
- Tags
- #IPL 2025






