గ్రౌండ్ లో కుప్పిగంతులు...పంత్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

by velandi.Saikiran |

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ( Lucknow Super Giants) కెప్టెన్ రిషబ్ పంత్

గ్రౌండ్ లో కుప్పిగంతులు...పంత్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ( Lucknow Super Giants) కెప్టెన్ రిషబ్ పంత్ కు ( Rishabh Pant) ఊహించని షాక్ తగిలింది. రిషబ్ పంత్ పై ఏకంగా 30 లక్షల జరిమానా విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). మంగళవారం రోజున లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది.

ఇక ఈ టోర్నమెంట్ లో చివరి మ్యాచ్ ఆడిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కు ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేయడంతో... యాక్షన్ తీసుకున్నారు. దీంతో లక్నో జట్టు పైన ఫైన్ వేసింది బీసీసీఐ. లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు ప్లేయర్లకు కూడా ఫైన్ పడింది. ప్లేయర్లకు 12 లక్షల జరిమానా విధించగా... రిషబ్ పంత్ కు 30 లక్షల పైన పడింది.

ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో లక్నోపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫైయర్ 1 కు దూసుకు వెళ్ళింది బెంగళూరు. కాగా ఈ మ్యాచ్ లోనే సెంచరీ చేసి దుమ్ము లేపాడు రిషబ్ పంత్. సెంచరీ చేసిన తర్వాత పల్టీలు కొట్టి మరి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ కొట్టిన పల్టీలు ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి.

Next Story