Nitish Reddy: నితీశ్‌రెడ్డి ఆడతాడా? ఆడడా? ఫ్యాన్స్‌కు టెన్షన్ టెన్షన్

by Vennela |

Nitish Reddy: నితీశ్‌రెడ్డి ఆడతాడా? ఆడడా? ఫ్యాన్స్‌కు టెన్షన్ టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: ipl 2025: నితీశ్‌రెడ్డి లేకుండా ఐపీఎల్‌లో హైదరాబాద్‌ ఆడే మ్యాచ్‌లు చూడాలంటే కచ్చితంగా అదో వెలితిగా ఉంటుంది. పక్కటెముక వద్ద నితీష్ మజిల్ స్ట్రెయిన్ అయ్యింది. దీంతో అతను ఆడతాడా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇండియన్ క్రికెట్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నితీష్ కుమార్ రెడ్డి. గత ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌ తరఫున అదరగొట్టిన ఈ వైజాగ్ కుర్రోడు, టీమ్ ఇండియాకు ఎంపికై అద్భుతంగా రాణించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సెంచరీ కొట్టి సిరీస్ హీరోగా నిలిచాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా, బౌలింగ్‌లో కూడా తన ప్రతిభను చాటుతూ ఇండియన్ టీమ్‌కు ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఇప్పుడు రానున్న ఐపీఎల్‌లో నితీష్ రెడ్డిని సన్‌రైజర్స్ కెప్టెన్ చేయాలని సోషల్ మీడియాలో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా పాట్ కమిన్స్ గాయపడటం, అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో స్పష్టత లేకపోవడం SRH టీమ్‌కు పెద్ద సమస్యగా మారింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్.. అసలు నితీష్ రెడ్డి ఐపీఎల్ ఆడతాడా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో T20 మ్యాచ్‌ నుంచి నితీష్‌ను తప్పించారు. కారణం.. సైడ్ స్ట్రైన్. అంటే పక్కటెముక వద్ద నితీష్ మజిల్ స్ట్రెయిన్ అయ్యింది. దీంతో 4 వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఇది మార్చి మొదటి వారం వరకు ఉంటుంది. మార్చి రెండో వారం నుంచి నితీష్ ప్రాక్టీస్ ప్రారంభించినా, మార్చి 22న ప్రారంభమయ్యే ఐపీఎల్‌కు పూర్తిగా ఫిట్ అవుతాడా? అన్నది ఇప్పటి హాట్ టాపిక్. గాయం తీవ్రమైనదేమీ కాకపోయినా, ఐపీఎల్ మిస్ అయితే, టీమ్ ఇండియా సెలెక్టర్లు నితీష్‌ను మర్చిపోవచ్చన్న భయం అభిమానుల్లో ఉంది. గత ఏడాది నితీష్ లాగా. ఈసారి ఇంకొక ఆటగాడు మెరుస్తే, భారత జట్టులోకి తిరిగి రావటానికి అతనికి కష్టంగా మారొచ్చ

సన్‌రైజర్స్‌కు నితీష్ ఎంత అవసరమో, నితీష్‌కూ SRH అంతే అవసరం. SRH మేనేజ్‌మెంట్‌, కావ్య మారన్ నితీష్‌కు అవసరమైన సహాయాన్ని అందిస్తే, అభిమానులు కచ్చితంగా సంతోషిస్తారు. ఎందుకంటే నితీష్ గత ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో టీమ్‌కు అవసరమైన సమయంలో నిలిచి, కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్‌లో ఆడుతూ, తన సత్తాను చాటాడు. బౌలింగ్‌లోనూ మంచి ప్రభావాన్ని చూపించాడు. వేగంగా వికెట్లు తీసే సత్తా చూపించి, ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు. టీమ్‌కు అవసరమైన సమయంలో బౌలింగ్ చేస్తూ, విలువైన కంట్రిబ్యూషన్ అందించాడు.

ఫీల్డింగ్‌లోనూ నితీష్ తన ప్రతిభను నిరూపించాడు. మంచి క్యాచ్‌లు పట్టి, టీమ్‌కు కీలక ఫీల్డర్‌గా నిలిచాడు. ఫీల్డింగ్‌లో అతడి ఎనర్జీ టీమ్‌కు చాలా మేలు చేసింది. ముఖ్యంగా, చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేయడం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం నితీష్‌లో ఉంది. స్ట్రైక్ రొటేట్ చేస్తూ, ఫినిషింగ్ టచ్ ఇవ్వగల సామర్థ్యంతో SRH కి ఒక ముఖ్యమైన ఆటగాడిగా మారాడు. మొత్తంగా చూసుకుంటే నితీష్ SRH కి ఒక విలువైన ఆల్‌రౌండర్. అతని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. తీమ్‌కు చాలా మేలు చేస్తుంది. ఈ సీజన్‌లో కూడా అతను అందుబాటులో ఉంటే SRHకి కచ్చితంగా ప్లస్ అవుతాడు

Next Story