IPL-2025: ఢిల్లీపై ఘన విజయం.. ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త రికార్డ్

by Kema Shiva Kumar |

ఐపీఎల్-2025 (IPL-2025)లో సంచనాలు నమోదవుతున్నాయి.

IPL-2025: ఢిల్లీపై ఘన విజయం.. ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025 (IPL-2025)లో సంచనాలు నమోదవుతున్నాయి. భారీ అంచనాలు ఉన్న జట్లు అపజయాల బాట పడుతుండగా.. ఏ మాత్రం అంచనాలు లేని జట్లు మాత్రం టేబుల్ అగ్రస్థానంలో నిలిచాయి. ఈ క్రమంలో ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ (Arun Jaitley) స్టేడియం వేదికగా ముంబాయ్ ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capital) జట్లు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబాయ్ జట్టు 12 పరుగులు తేడాతో అదృష్టం కొద్దీ ఓదార్పు విజయం సాధించింది. అయినా, ఆ జట్టు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌ 200 కంటే ఎక్కువ స్కోర్ చేసినప్పుడల్లా విజయం సాధించిన జట్టుగా ముంబై నిలించింది. ఇప్పటి వరకు వరుసగా 15 మ్యాచుల్లో ఆ జట్టు గెలుపొందింది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు కూడా ఇలాగే 13 సార్లు ఇలానే విజయం సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 200 కంటే ఎక్కువ స్కోర్‌ను 21 సార్లు డిఫెండ్ చేసుకోగా.. ఐదుసార్లు చేతులెత్తేసింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్సీబీ (19 విజయాలు, 5 ఓటములు), సన్ రైజర్స్ (15 విజయాలు, 2 ఓటములు) జట్లు ఉన్నాయి.

కాగా, ఢిల్లీ (Delhi)తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. తిలక్‌ వర్మ (59), నమన్‌ ధీర్‌ (38) ధాటిగా ఆడి పరుగులు వేగంగా రాబట్టారు. అదేవిధంగా రికిల్‌టన్‌ (41), సూర్యకుమార్‌ (40) పరుగులతో జట్టు భారీ స్కోర్ చేయండి తమ సహకారం అందించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్ (Delhi Capitals) బ్యాట్స్‌మెన్లు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89 పరుగులు) చెలరేగి ఆడినా జట్టు ఓటమి పాలైంది. అయితే, విజయానికి చివరి 9 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సమయంలో వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు రనౌట్‌ అయ్యారు. దీంతో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడతో ముంబై జట్టు 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Next Story