డీ'కాక రేపిండు

by Ajay kumar |
డీకాక రేపిండు
X

- 97 పరుగులతో చెలరేగిన కేకేఆర్ ఓపెనర్

- బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన షారుఖ్ జట్టు

-కోల్‌కతాకు తొలి విజయం

- రాజస్థాన్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే ఓడిపోయిన కోల్‌కతా జట్టు రెండో మ్యాచ్‌లో అదరగొట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి.. ఓటమితో సీజన్ ఆరభించడం ఆ జట్టులో కసిని రేపిందేమో.. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. గౌహతిలోని బస్సపరా స్టేడియంలో ఇవ్వాళ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విజయం సాధించింది. ఆర్ఆర్ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం.

ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 152 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగన కేకేఆర్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. మొయిన్ అలీకి పెద్దగా బ్యాటింగ్ అవకాశం రాకపోయినా.. డికాక్ మాత్రం చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. అయితే మొయిన్ అలీ (5) రనౌట్‌గా వెనుదిరిగి తర్వాత వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే.. క్వింటన్ డికాక్‌తో కలిసి రెండో వికెట్‌కు 29 పరుగులు జోడించాడు. రహానే (18) అవుటైన తర్వాత అంగ్‌క్రిష్ రఘువంశీ (22) చక్కని తోడ్పాటు అందించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ మొత్తం డికాక్ వన్‌ మ్యాన్ షోగా మారిపోయింది. కేవలం 61 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సులతో 97 పరుగులు చేశాడు. దీంతో కేకేఆర్ జట్టు కేవలం 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 153 పరుగలు చేసి విజయం సాధించింది.హసరంగకు ఒక వికెట్ లభించింది. డికాక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

కట్టడి చేసిన కేకేఆర్..

అంతకు ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్ బౌలర్లు రాజస్థాన రాయల్స్ జట్టును కట్టడి చేశారు. వాస్తవానికి రాజస్థాన్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్నే అందించారు. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ కలిసి దూకుడుగా ఆడారు. అయితే దూకుడు మీద ఉన్న శాంసన్ (13)ను వైభవర్ అరోరా అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత కేకేఆర్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు ఆర్ఆర్ జట్టు పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. వరుణ్ చక్రవర్తి వరుస ఓవర్లలో రియాన్ పరాగ్ (25), హసరంగ (4)లను పెవీలియన్‌కు పంపాడు. ఆ మధ్యలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (29) మొయిన్ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారింది. అయితే ధ్రువ్ జురెల్ మాత్రం క్రీజులో నిలబడి పరుగులను రాబట్టాడు. వరుసగా బౌండరీలు కొడుతూ పరుగుల వేగం పెంచాడు. అయితే నితీశ్ రాణా (8), శుభమ్ దూబే (9) కూడా విఫలవమవడం.. హిట్‌మెయర్ కూడా అనుకున్నంతగా రాణించక పోవడంతో పరుగుల భారం మొత్తం జురెల్ మీదే పడింది. అయితే జురెల్ అవుటైన తర్వాత ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (16) కాస్త పర్వాలేదనిపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించింది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. స్పెన్సర్స్ జాన్సన్‌కు ఒక వికెట్ లభించింది.

స్కోర్ బోర్డు :

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్ (సి) హర్షిత్ రాణా (బి) మొయిన్ అలీ 29, సంజూ శాంసన్ (బి) వైభవ్ అరోరా 13, రియాన్ పరాగ్ (సి) క్వింటన్ డికాక్ (బి) వరుణ్ చక్రవర్తి 25, నితీశ్ రాణా (బి) మొయిన్ అలీ 8, వానిందు హసరంగ (సి) అజింక్య రహానే (బి) వరుణ్ చక్రవర్తి 4, ధ్రువ్ జురెల్ (బి) హర్షిత్ రాణా 33, శుభమ్ దూబే (సి) ఆండ్రీ రస్సెల్ (బి) వైభవ్ అరోరా 9, షిమ్రోన్ హిట్‌మెయర్ (సి) అంగ్‌క్రిష్ రఘువంశి (బి) హర్షిత్ రాణా 7, జోఫ్రా ఆర్చర్ (బి) స్పెన్సర్ జాన్సన్ 16, మహీశ్ తీక్షణ 1 నాటౌట్, తుషార్ దేశ్‌పాండే 2 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 4; మొత్తం 151/9(20 ఓవర్లు)

వికెట్ల పతనం: 33-1. 67-2, 69-3, 76-4, 82-5, 110-6, 131-7, 138-8, 149-9

బౌలింగ్ : స్పెన్సర్ జాన్సన్ (4-0-42-1), వైభవ్ అరోరా (4-0-33-2), హర్షిత్ రాణా (4-0-36-2), మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2)

కోల్‌కతా నైట్ రైడర్స్ : మొయిన్ అలీ (రనౌట్) 5, క్వింటన్ డికాక్ 97 నాటౌట్, అజింక్య రహానే (సి) తుషార్ దేశ్‌పాండే (బి) వానిందు హసరంగ 18, అంగక్రిష్ రఘువంశి 22 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 11; మొత్తం 153/2(17.3 ఓవర్లు)

వికెట్ల పతనం : 41-1, 70-2

బౌలింగ్ : జోఫ్రా ఆర్చర్ (2.3-0-33-0), మహీశ్ తీక్షణ (4-0-32-0), రియాన్ పరాగ్ (4-0-25-0), సందీప్ శర్మ (2-0-11-0), వానిందు హసరంగ (3-0-34-1), నితీశ్ రాణా (1-0-9-0), తుషార్ దేశ్‌పాండే(1-0-7-0)



Next Story

Most Viewed