IPL 2025: ఇవాళ చెన్నైతో RCB మ్యాచ్..కోహ్లీ మాస్టర్ ప్లాన్ !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్

IPL 2025: ఇవాళ చెన్నైతో RCB మ్యాచ్..కోహ్లీ మాస్టర్ ప్లాన్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Chennai Super Kings vs Royal Challengers Bangalore ) మధ్య... బిగ్ ఫైట్ జరగనుంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్... చెన్నైలోని ( Chennai) ఎంఏ చిదంబరం స్టేడియంలో ( MA Chidambaram Stadium ) నిర్వహించబోతున్నారు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు (RCB) ఒక్కో విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా వస్తోంది.

రెండు జట్ల మధ్య బలాబలాలు

చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. ఏకంగా 21 మ్యాచ్ ల్లో ఆర్సిబిని చిత్తు చేసింది చెన్నై. అటు చెన్నై సూపర్ కింగ్స్ పై ( ( Chennai Super Kings) కేవలం 11 మ్యాచ్ ల్లో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఈ రికార్డుల ప్రకారం ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో చూడాలి.

Next Story