బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు

by Ajay Maddhiboyina |

ఐపీఎల్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో దర్శనం ఇస్తున్నా బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్లు
X

- రూ.1 లక్ష వరకు పలుకుతున్న టికెట్లు

- అఫీషియల్ సేల్‌కు ముందే బ్లాక్ టికెట్ల దందా

- సీఎస్కే మ్యాచ్‌లకే ఎక్కువ డిమాండ్

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభం కావడానికి మరో 10 రోజుల సమయం ఉండగానే ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై, చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా సీఎస్కే, ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం ఎంత చెల్లించైనా స్టేడియంలకు వెళ్లాలనుకుంటారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని బ్లాక్ మార్కెట్ నడిపించే వారు క్యాష్ చేసుకుంటుంటారు. సీఎక్కే మ్యాచ్‌లకు సంబంధించి అధికారికంగా టికెట్ల విక్రయం ఇంకా మొదలు కాలేదు. కానీ అప్పుడే బ్లాక్ మార్కెట్లో ఈ మ్యాచ్‌ల టికెట్ల కోసం డిమాండ్ పెరిగిపోయింది. ఐపీఎల్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా.. ముంబై, సీఎస్కే మధ్య మార్చి 23న తొలి మ్యాచ్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన రీసేల్ టికెట్లు వెబ్ సైట్లలో దర్శనమిచ్చాయి. అధికారికంగా టికెట్లు విడుదల కాకపోయినా.. ముందుగానే రీసేల్ వెబ్‌సైట్లలో బుకింగ్ చేసుకుంటున్నారు. రూ.17,804 ఉన్న టికెట్ కోసం రూ.1 లక్ష చెల్లించడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ముంబైతో మ్యాచ్ కోసం రూ.5వేల టికెట్‌ను రూ.57 వేలకు కొనేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తిని గమనించిన బ్లాక్ మార్కెట్ దందా నడిపేవాళ్లు రీసేల్ వెబ్‌సైట్లలో భారీ ధరలకు ముందుగానే బుకింగ్స్ తీసుకుంటున్నారు. ఇక ఏప్రిల్ 20న వాంఖడే స్టేడియంలో జరుగనున్న సీఎస్కే, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు రూ.5,13,514 పెట్టి ఒక ఫ్యాన్ రీసేల్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో దర్శనం ఇస్తున్నా బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

Next Story