IPL 2023..SRH కొత్త కెప్టెన్‌గా భువనేశ్వర్‌కే ఆకాశ్ చోప్రా ఓటు

by Disha Web Desk 12 |
IPL 2023..SRH కొత్త కెప్టెన్‌గా భువనేశ్వర్‌కే ఆకాశ్ చోప్రా ఓటు
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. అయితే గత సీజన్‌లో కెఫ్టెన్ గా వ్యవహరించిన విలియమ్సన్ ను SRH జట్టు వదులుకుంది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ కెప్టెన్ స్థానం ఖాళీగా ఉంది. కెప్టెన్ స్థానానికి కొత్తగా తీసుకున్న మయాంక్ అగర్వాల్, అలాగే సౌత్ ఆఫ్రికా చెందిన.. ఐడెన్ మార్క్రమ్, అలాగే భువనేశ్వర్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే SRH కొత్త కెప్టెన్‌గా ఎంచుకోమని ఒక అభిమాని ఆకాష్ చోప్రా అడిగాడు. దీనికి స్పందించిన చోప్రా.. తన ఓటు భువనేశ్వర్ కుమార్‌కే అని ఒప్పుకున్నాడు. అలాగే మార్క్రమ్‌ని తీసుకొవడం కూడా మంచి అవకాశమే అని అన్నారు.

మయాంక్ అగర్వాల్ గతంలో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్‌గా భాద్యతలు తీసుకుని మంచి ఫలితాలను సాధించాడు. అలాగే ఐడెన్ మార్క్రమ్ కూడా ఇటీవల జరిగిన ఓ లీగ్ లో సన్ రైజర్స్ పేరుతో ఎంట్రీ ఇచ్చి టైటిల్ గెలుచుకున్నాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ కూడా జట్టులో సీనియర్ ఆటగాడు కావడం విశేషం. అయితే ఈ ముగ్గురిలో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారో తెలియాలి అంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే మరి.



Next Story

Most Viewed