IPL 2023: పంజాబ్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం

by Disha Web Desk 12 |
IPL 2023: పంజాబ్‌కు భారీ షాక్.. సీజన్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 ఈ నెల 31 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ అయిన జానీ బెయిర్‌స్టో గాయాల కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బెయిర్‌స్టో ఎడమ కాలు విరగడం వల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు. కాగా జూన్ 16 నుండి యాషెస్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో అతను పూర్తిగా కోలుకుని యాషెస్ కు తిరిగి వచ్చే వరకు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకొవాలని ఇంగ్లాండ్ జట్టు అతనికి తెలిపింది. దీంతో బెయిర్‌స్టో ఈ ఐపీఎల్ సీజన్ ఆడటం ఇక కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ప్రపంచ నెంబర్ వన్ వన్డే జట్టుగా ఆస్ట్రేలియా..

Next Story

Most Viewed