- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC World Cup 2023: పాకిస్తాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. ఇంజమామ్ ఉల్ హాక్ రాజీనామా

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హాక్ తన పదవికి రాజీనామా చేశాడు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంజమామ్ వెల్లడించాడు. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సైతం ధృవీకరించింది. వరల్డ్‌కప్-2023లో వరుస వైఫల్యాలతో (6 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్ జట్టుకు ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
పాక్ లోకల్ న్యూస్ ఛానల్ కథనం ప్రకారం.. పీసీబీలో ప్లేయర్స్ మేనేజ్‌మెంట్ కోసం రిజిస్టర్ చేయబడిన కంపెనీలో ఇంజమామ్ భాగస్వామి అని తెలుస్తుంది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో అవినీతి జరిగి ఉంటుందని పాక్ ప్రజలు సోషల్‌మీడియా వేదికగా ఇంజమామ్‌పై ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్ తన పదవికి రాజీనామా చేస్త్నన్నట్లు ఇవాళ ప్రకటించాడు.
- Tags
- Inzamam Ul Haq






