- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడాలంటే భయమేసేది.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) క్రీజులోకి వచ్చాడంటే చాలు అంత ఈజీగా అవుట్ అవ్వడు. ఎలాంటి బౌలర్‌కు అయినా కఠిన పరీక్ష పెడతాడు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) క్రీజులోకి వచ్చాడంటే చాలు అంత ఈజీగా అవుట్ అవ్వడు. ఎలాంటి బౌలర్‌కు అయినా కఠిన పరీక్ష పెడతాడు. తాను ఒంటిచేత్తో జట్టును గెలిపించిన మ్యాచులు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కోహ్లీని అవుట్ చేసేందుకు బౌలర్లు పడే శ్రమ అంతా ఇతా కాదు. అలాంటి విరాట్ కోహ్లీ ముగ్గురు బౌలర్లను చూస్తే భయపడేవాడట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీనే చెప్పారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠిన బౌలర్ల పేర్లను రివీల్ చేశారు. టెస్టుల్లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్, వన్డేల్లో శ్రీలంకన్ స్టార్ లసిత్ మలింగ, ఆదిల్ రషీద్(ఇంగ్లండ్), టీ20ల్లో సునీల్ నరైన్(వెస్టిండీస్) బౌలింగ్‌లో తాను చాలా ఇబ్బందులు పడే వాడినని చెప్పుకొచ్చారు. కాగా, మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ 27,559 పరుగులు చేశారు. టెస్టుల్లో 30 సెంచరీలు, వన్డేల్లో 51 సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ చేశారు. ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ బౌలింగ్‌లో ఎక్కువ సార్లు అవుట్ అయినట్లు వెల్లడించారు.






