Sehwag: ‘నా ఆకలి తీరాలంటే పాకిస్తాన్‌పై సెంచరీ చేయాలని ఫిక్స్ అయ్యా’

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) మాజీ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

Sehwag: ‘నా ఆకలి తీరాలంటే పాకిస్తాన్‌పై సెంచరీ చేయాలని ఫిక్స్ అయ్యా’
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) మాజీ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్రికెట్‌ను చూసే అందరికీ సుపరిచతమే. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్‌తో తలపడిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 'ఎప్పుడు పాకిస్తాన్‌పై మ్యాచ్ఏ(India Pakistan match) ఓడినా నేను నా టెంపర్మెంట్ కోల్పోతాను. 2008 కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 300 రన్స్ ఛేజ్ చేయాలి. ఆరోజు నేను ఉపవాసంలో ఉన్నా. నా ఆకలి తీరాలంటే రన్స్ చేయాలనుకున్నా' అని చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 95 బంతుల్లో 119 రన్స్ చేశారు. టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Next Story