- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aira Rawat: అందానికే ఆధార్ కార్డులా ఉంది... ఎవరీ బ్యూటీ!
ఇటీవల జరిగిన భారత్ అమెరికా టీ20 మ్యాచ్ లో ఐరా రావత్ అనే బ్యూటీ సందడి చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరా మెన్ కళ్లు ఐరాపై పడటంతో స్టార్ అయిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ఐరా రావత్ ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లైవ్ వచ్చేటప్పుడు కేవలం ఆట మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ కెమెరాలు అందాల భామలవైపు కూడా మల్లుతుంటాయి. అలా కెమెరాలో కనిపించిన చాలా మంది బ్యూటీలు ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్లుగా, సినిమాల్లో రానిస్తున్నారు.
ఒక్కసారి కెమెరా మెన్ మనసు దోచుకున్నారంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఐరా కూడా అలానే స్టార్ అయిపోయింది. ఈ బ్యూటీ ఇటీవల జరిగిన భారత్ అమెరికా టీ20 మ్యాచ్ లో సందడి చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరా మెన్ కళ్లు ఐరాపై పడటంతో కళ్లార్పకుండా ఆ బ్యూటీనే చూపించాడు.
ఇంకేముదు ఐరా అందానికి ఫిదా అయిన నెటిజన్లు రాత్రికి రాత్రే ఆమె అకౌంట్ కు ఫాలో కొట్టేశారు. దీంతో ఐరా ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 3.98 లక్షలకు చేరుకుంది. అంటే నాలుగు లక్షలకు అతి చేరువలో ఉంది.
మ్యాచ్ జరిగిన రోజు ఐరా బ్లూ టీషర్ట్, వైట్ కలర్ షార్ట్ లో మెరిసిన బ్యూటీ ఆ ఫోటోలను కూడా తన ఇన్ స్టాలో పంచుకుంది. ఇక ప్రస్తుతం ఐరా ఫాలోవర్స్ పెరుగుతుండగా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓవర్ నైట్ స్టార్ గా మారిన బ్యూటీ జీవితం ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.






