టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు పంత్ ఆడటం డౌటే?.. అతనికి ఏమైందంటే?

by Harish |

ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.

టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు పంత్ ఆడటం డౌటే?.. అతనికి ఏమైందంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడినట్టు తెలుస్తోంది. ఆదివారం నెట్ ప్రాక్టీస్‌ సెషన్‌లో పంత్ ఎడమ చేతికి గాయమైనట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్ చేస్తుండగా బంతి అతని చేతికి బలంగా తాకినట్టు తెలుస్తోంది. దీంతో అతను తీవ్ర నొప్పితో విలవిలాడిపోయాడని, ఫిజియో మైదానంలోకి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడని సదరు మీడియా పేర్కొంది. పంత్ చేతికి బ్యాండేజ్ వేసినట్టు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకునే వరకు అతను మిగతా ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 20 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా ఆ నాటికి పంత్ కోలుకుంటాడా?లేదా? అన్న ఆందోళన నెలకొంది. మ్యాచ్ నాటికి ఫిట్‌గా లేకుంటే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే. పంత్ అందుబాటులోకి రాకపోతే బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావచ్చు. ఇంగ్లాండ్ లయన్స్‌తో సిరీస్‌లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో పంత్‌ను బీసీసీఐ వైస్ కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, పంత్ ఇటీవల ఫామ్ లేడు. ఐపీఎల్‌లో దారుణంగా విఫలమయ్యాడు. బెంగళూరుతో ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. 13 మ్యాచ్‌ల్లో 269 రన్స్ చేశాడు.


Next Story