చివరి టెస్టులో గెలవండి ప్లీజ్.. రిషబ్ పంత్ ఎమోషనల్ కామెంట్స్

by velandi.Saikiran |   (  Updated:2025-07-28 10:33:54  IST  )

టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ పై రిషబ్ పంత్ ( Rishbh Pant)

చివరి టెస్టులో గెలవండి ప్లీజ్.. రిషబ్ పంత్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ పై రిషబ్ పంత్ ( Rishbh Pant) కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి టెస్టులో గెలవండని.. ఇండియా కోసం సాధించండి అంటూ ఎమోషనల్ సందేశాన్ని పంపారు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటి వరకు జరిగిన నాలుగో టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే.

చివరి వరకు రవీంద్ర జడేజా అలాగే వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar) ఇద్దరు అద్భుతంగా పోరాటం చేయడంతో.. మ్యాచ్ డ్రా అయింది. ఇది ఇలా ఉండగా.. నాలుగో టెస్ట్ మ్యాచ్ లో పంత్ కు తీవ్రమైన గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఐదో టెస్టుకు దూరమవుతున్నాడు పంత్. ఈ నేపథ్యంలోనే కీలక సందేశం టీమిండియా కు పంపాడు.

చివరి టెస్టులో దేశం కోసం గెలవాలని.. ఆ దిశగా టీమిండియా అడుగులు వేయాలని పిలుపునిచ్చాడు రిషబ్ పంత్. వ్యక్తిగత లక్ష్యం గురించి ఆలోచించకుండా జట్టును గెలిపించేందుకు.. టీమిండియా సభ్యులు కృషి చేయాలని కోరారు. దేశం కోసం ఆడేటప్పుడు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా... గెలిచి తీరాలని పేర్కొన్నారు.

Next Story