మహిళల ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్ షాక్

by Harish |

మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది.

మహిళల ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె ఆస్ట్రేలియాతో సెమీస్‌కు దూరమవడం భారత జట్టుకు భారీ దెబ్బే. ఆమె స్థానంలో షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రతీక గాయపడింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆమె బంతిని ఆపే క్రమంలో ఆమె మోకాలు, చీలమండలానికి గాయమైంది. నొప్పితో విలవిలలాడిపోయిన ఆమె మైదానం వీడింది. తిరిగి మైదానంలోకి రాలేదు. భారత్ ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్‌కు దిగలేదు. ఓపెనర్‌గా అమన్‌జోత్ వచ్చింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న ప్రతీక 308 రన్స్ చేసింది. అందులో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. ప్రస్తుతం టోర్నీ టాప్ స్కోరర్ల జాబితాలో ఆమె రెండో స్థానంలో ఉన్నది.


Next Story