- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. నాలుగో టీ20లో భారత్ భారీ స్కోర్
భారత మహిళలు, శ్రీలంక మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళలు, శ్రీలంక మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నాలుగో టీ20 మ్యాచ్ తిరువనంతపురం వేదికగా ప్రారంభం అయింది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధనా, షెఫాలి వర్మలు మొదటి వికెట్ కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. స్మృతి మంధనా 80, షెఫాలి వర్మ 79 పరుగులు చేయగా చివర్లో వచ్చిన రిచా ఘోష్ శ్రీలంక బౌలర్లపై విరుచుకు పడింది. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టి 40 పరుగులు చేసింది. అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 16 పరుగులతో రాణించగా భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఈ మ్యాచులో శ్రీలంక జట్టు విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 222 పరుగులు చేయాల్సి ఉంది. ఈ టీ20 సిరీస్ లో ఇప్పటికే 3 మ్యాచులో ఓడిపోయిన శ్రీలంక జట్టు ఈ మ్యాచులో అయిన గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.






