- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్.. మొదట బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచ కప్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది.

దిశ, వెబ్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచ కప్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు న్యూజిలాండ్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. ముంబై వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన తర్వాత భారత మహిళల జట్టు 3 కీలక మ్యాచుల్లో ఓడిపోయింది. దీంతో మిగిలిన రెండు మ్యాచ్ లో భారత్ తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచులో భారత జట్టు విజయం సాధించి సూపర్ ఫోర్ లో నిలుస్తుందా లేదా తెలియాలంటే వేచి చూడాల్సిందే.
భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
న్యూజిలాండ్ మహిళలు (ప్లేయింగ్ XI): సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(సి), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(w), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్






