- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
INDW vs AUSW 3rd ODI: సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా
భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య వన్డే సిరీస్ (ODI series) జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచులో కంప్లీట్ కాగా.. ఈ రోజు మూడో మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో జరుగుతుంది. ఈ నిర్ణయాత్మక మ్యాచుల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా (Australia) జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు జట్లు చెరో మ్యాచ్ లో భారీ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఫలితం పైనే సిరీస్ విజయం ఆధారపడి ఉండటం తో నేటి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
దీంతో ఈ మ్యాచ్ మొదటి నుంచి రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో టాస్ ఓడిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. మనం మంచి క్రికెట్ ఆడటం గురించి మాట్లాడుకుందాం. ముందు ఏం చేసినా పర్వాలేదు. మేము అత్యుత్తమ క్రికెట్ ఆడటం, మనల్ని ఎల్లప్పుడూ ఆటలో ఉంచుతుంది. ఈరోజు కూడా అదే సానుకూల మనస్తత్వంతో ముందుకు సాగాలనుకుంటున్నాను. అని చెప్పుకొచ్చింది.
భారత్ ప్లేయింగ్ XI : ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w/c), రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్
ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: అలిస్సా హీలీ (w/c), జార్జియా వోల్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, గ్రేస్ హారిస్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్‌హామ్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్






