INDW vs AUSW: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

by Malleboina Mahesh |

భారత మహిళలు, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.

INDW vs AUSW: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్ డెస్క్: భారత మహిళలు, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య వన్డే సిరీస్ (ODI series) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలు ఆస్ట్రేలియా విజయం సాధించగా ఈ రోజు ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. ఛండీఘర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్లు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే మొదటి వన్డేలో దారుణంగా ఓడిపోయిన భారత్, రెండో వన్డేలో గెలిచి కసితీర్చుకొవాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే జట్టులో స్వల్ప మార్పులు చేసింది. మరీ ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

భారత్ ప్లేయింగ్ XI: స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (కెప్టెన్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI: అలిస్సా హీలీ (కెప్టెన్), జార్జియా వోల్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, జార్జియా వేర్‌హామ్, అలానా కింగ్, డార్సీ బ్రౌన్, మేగాన్ షుట్

Next Story