ఇద్దరు ఫుట్‌బాల్ మ్యాచ్ అధికారులకు జైలు శిక్ష.. ఇండోనేషియా కోర్టు సంచలన తీర్పు

by Vinod kumar |
ఇద్దరు ఫుట్‌బాల్ మ్యాచ్ అధికారులకు జైలు శిక్ష.. ఇండోనేషియా కోర్టు సంచలన తీర్పు
X

న్యూఢిల్లీ: ఇద్దరు ఫుట్‌బాల్ మ్యాచ్ అధికారులకు గురువారం జైలు శిక్ష పడింది. క్రీడా చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటనల్లో ఇదొకటి. గత అక్టోబరులో తూర్పు జావా నగరంలోని మలాంగ్‌లో క్రీడాభిమానులు స్టేడియంలోకి దూసుకొచ్చి పిచ్‌ను ధ్వంసం చేయాలని చూశారు. దీంతో పోలీసులు ప్రేక్షకులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘటనలో దాదాపు 135 మంది మరణించారు. వందలాది మంది ప్రజలు ఇరుకైన మార్గం గుండా బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 40 కంటే ఎక్కువ మంది చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. ఈ ఘటనలో ప్రాసిక్యూటర్లు మ్యాచ్ నిర్వాహకుడు అబ్దుల్ హారిస్‌కు ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్షను కోరారు. కానీ ఇండోనేషియా కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది.

‘నేను నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తున్నాను’ అని ప్రిసైడింగ్ జడ్జి అబు అచ్మద్ సిద్కీ అమ్సియా సురబయ నగరంలోని కోర్టుకు తెలిపారు. ఈ విషాదంపై ఇండోనేషియా తొలి తీర్పు ఇది. భద్రతా అధికారి సుకో సూట్రిస్నో నిర్లక్ష్యానికి పాల్పడ్డారని న్యాయమూర్తులు నిర్ధారించారు. దీంతో అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. ‘ప్రతివాది ఈ గందరగోళాన్ని ముందుగానే ఊహించలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి అత్యవసర పరిస్థితి లేదు.

ప్రతివాది భద్రతా అధికారిగా కూడా తన పనిని అర్థం చేసుకోలేదు’ అని న్యాయమూర్తి అన్నారు. తీర్పుపై అప్పీల్ చేయడానికి ఇద్దరికీ ఏడు రోజుల సమయం ఉంది. ముగ్గురు స్థానిక పోలీసు అధికారులపై కూడా అభియోగాలు ఉన్నాయి. తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed