- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్‌లో భారత్ బోణీ.. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం
ఆసియా కప్ టీ20(Asia Cup 2025) టోర్నీలో భారత్(India) బోణీ కొట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ టీ20(Asia Cup 2025) టోర్నీలో భారత్(India) బోణీ కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా యూఏఈ(United Arab Emirates)తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు 13.1 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ అలీషాన్ షరాఫు(22), కెప్టెన్ మహమ్మద్ వసీమ్(19) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో రాణించాడు. శివమ్ దుబే మూడు, బుమ్రా, అక్షర్‌పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఇక 58 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి వచ్చిన భారత్ కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసింది. తొమ్మిది వికెట్ల తేడాతో యూఏఈని ఓడించింది. ఫోర్‌తో శుభ్‌మన్ గిల్ విన్నింగ్ షాట్ కొట్టారు. అభిషేక్ శర్మ (30), శుభ్‌మన్ గిల్(20), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(07) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్ధికీ ఒక వికెట్ తీశారు.






