భారత్ సంచలన విజయం.. లైవ్ మ్యాచ్ చుసిన మెగాస్టార్ స్పెషల్ ట్వీట్

by Ramesh Goud |   (  Updated:2025-02-24 13:34:29  IST  )

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ జరిగిన భారత్ -పాక్ మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది.

భారత్ సంచలన విజయం.. లైవ్ మ్యాచ్ చుసిన మెగాస్టార్ స్పెషల్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ (Chamipons Trophy) లో భాగంగా దుబాయ్ (Dubai) జరిగిన భారత్ -పాక్ మ్యాచ్ (India Pak Match) లో ఇండియా (India) ఘన విజయం (Grand Victory) సాధించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ప్రదర్శనతో సెంచరీ (Sectury) బాది, జట్టు విజయానికి దోహదపడ్డాడు. 242 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు (Indian Playersa) మరో 42 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో పాక్ ఇంటి బాట పట్టక తప్పలేదు. దీనిపై ఇండియన్స్ అమితానందంతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఆట ముగిసిన తర్వాత మైదానంలో పెద్ద ఎత్తున బణాసంచా కాల్చారు.

ఈ నేపథ్యంలోనే ఇండియా -పాక్ లైవ్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇండియా విజయంపై ట్విట్టర్ (Twitter) వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చిరు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీనిపై ఆయన.. పాకిస్తాన్ పై భారత్ అద్భుతంగా విజయం సాధించిందని, ఇది ఎంతో అద్భుతమైన మ్యాచ్ అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ (Super Thrilling Victory) ని కొంతమంది ప్రియమైన స్నేహితులతో ప్రత్యక్ష ప్రసారం (Live)లో చూడటం చాలా ఉత్సాహంగా ఉంది అని చెప్పారు.

ఇక గొప్ప విజయాన్ని అందించిన భారత జట్టు మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. అంతేగాక మ్యాచ్ గెలిచాక పేల్చిన బాణసంచా చూడటం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. ఇక విరాట్ కోహ్లీ సంచలన ప్రదర్శన కనబరిచాడని అన్నారు. శ్రేయస్ అయ్యార్ (Shreyas ayyar), శుభమన్ గిల్ (Shub man Gill), కుల్ దీప్ యాదవ్ (Kuldeep Yadav), కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma)తో పాటు జట్టు మొత్తం అద్భుతంగా ఆడారని తెలిపారు. ఇక ఈ విజయం భారతదేశానికి మరింత శక్తినిస్తుందని చెబుతూ.. జై హింద్ అని చిరు ట్వీట్ చేశారు.

Next Story