బుమ్రా రీ-ఎంట్రీ.. లార్డ్స్‌లో 6 గురు బ్యాటర్లతో టీమిండియా !

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అంటే ఈనెల 10వ తేదీన

బుమ్రా రీ-ఎంట్రీ.. లార్డ్స్‌లో 6 గురు బ్యాటర్లతో టీమిండియా !
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అంటే ఈనెల 10వ తేదీన లార్డ్స్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి... సిరీస్ సమం చేశాయి. ఇలాంటి నేపథ్యంలో మూడవ టెస్ట్ చాలా కీలకం కానుంది. అది కూడా లార్డ్స్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో అందరికన్నా ఈ టెస్ట్ మ్యాచ్ పైన పడింది.

ఇలాంటి నేపథ్యంలో టీమిండియా జట్టులోకి తిరిగి బుమ్రా వస్తున్నాడు. అతను లేకుండానే రెండు టెస్ట్ గెలిచిన టీమిండియా.. ఇప్పుడు అతడు రీయంట్రి ఇస్తున్న నేపథ్యంలో అభిమానులు సంబరపడిపోతున్నారు. అలాగే ఆరుగురు బ్యాటర్లతో రంగంలోకి దిగేందుకు టీమిండియా సిద్ధమైంది. ఎప్పటిలాగే యశస్వి జైస్వాల్, కె ఎల్ రాహుల్ ఓపెన్ గా బరిలోకి దిగుతారు.

సాయి సుదర్శన్ మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు. దీంతో అతడు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అనంతరం కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్ తమ పాత్ర పోషించనున్నారు. ఆరవ బ్యాటర్ గా కరుణ్ నాయర్ రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడు. బౌలర్లుగా సిరాజ్, ఆకాష్, బుమ్రా, అర్ష్ దీప్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది.

Next Story