34 బంతుల్లోనే సెంచరీ.. భారత మహిళా క్రికెటర్ వరల్డ్ రికార్డు

by Harish |

భారత మహిళా క్రికెటర్ కిరణ్ నవ్‌గిరే వరల్డ్ రికార్డు సృష్టించింది.

34 బంతుల్లోనే సెంచరీ.. భారత మహిళా క్రికెటర్ వరల్డ్ రికార్డు
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ కిరణ్ నవ్‌గిరే వరల్డ్ రికార్డు సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్‌‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచింది. బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో కిరణ్ ఈ ఘనత సాధించింది. మహారాష్ట్రకు ఆడుతున్న ఆమె పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లోనే సెంచరీ చేసింది. దీంతో మహిళల టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ సూఫీ డివైన్ పేరిట ఉండేది. 2021లో సూపర్ స్మాష్ టీ20 లీగ్‌లో డివైన్ 36 బంతుల్లో శతకం బాదింది.

తాజాగా కిరణ్ ఆమె రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాకుండా కిరణ్ 302.86 స్ట్రైక్ రేటుతో సెంచరీ చేయగా.. మహిళల టీ20 క్రికెట్‌లో 300లకుపైగా స్ట్రైక్‌రేట్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా కూడా ఘనత సాధించింది. కిరణ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మహారాష్ట్ర 9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 110/6 స్కోరు చేయగా.. మహారాష్ట్ర 8 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 113 పరుగులు చేసింది. కిరణ్ 35 బంతుల్లో 106 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.


Next Story