- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రజతంతో మెరిసిన పారా అథ్లెట్ యోగేష్
by Phanindra |
వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పారా అథ్లెట్ యోగేష్ రజతంతో మెరిశాడు. డిస్కస్ త్రోలో అద్భుతంగా రాణించాడు.

X
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యోగేష్ కథూనియా రజతంతో మెరిశాడు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ పోటీల్లో ఎఫ్56 డిస్కస్ త్రోవర్ యోగేష్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గోల్డ్ మెడల్ కోసం పోటీ పడిన యోగేష్.. చివరకు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బ్రెజిల్‌కు చెందిన క్లాడినీ బతిస్తా ఈ పోటీల్లో స్వర్ణం సాధించాడు. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో యోగేష్‌కు ఇది మూడో సిల్వర్ మెడల్ కావడం గమనార్హం. గతంలో పారాలింపిక్ గేమ్స్‌లో కూడా యోగేష్ రజంత సాధించాడు. అయితే స్వదేశంలో రజతం గెలవడం మరో గొప్ప అనుభూతి అని అతను తెలిపాడు. సౌదీకి చెందిన నైఫ్ అల్మస్రాషీ 100 మీటర్ల టీ44 ఫైనల్‌లో వరల్డ్ రికార్డు సృష్టించడం గమనార్హం. అతను కేవలం 10.94 సెకన్లలోనే రేస్ ముగించాడు.
Next Story






