Asian Games 2023: ఆర్చరీలో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

by Malleboina Mahesh |   (  Updated:2023-10-05 11:15:08  IST  )

19 వ ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు బంగారు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మొదట షూటింగ్ లో అత్యధిక పతకాలు అందుకున్న భారత్ తాజాగా ఆర్చరీలో బంగారు పతకాలను అందుకుంటుంది.

Asian Games 2023: ఆర్చరీలో భారత్‌కు మరో గోల్డ్ మెడల్
X

దిశ, వెబ్‌డెస్క్: 19 వ ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు బంగారు పతకాల వేట కొనసాగిస్తున్నారు. మొదట షూటింగ్ లో అత్యధిక పతకాలు అందుకున్న భారత్ తాజాగా ఆర్చరీలో బంగారు పతకాలను అందుకుంటుంది. ఇవాళ ఆర్చరీలో భారత్ 3వ బంగారు పతకం సాధించింది. ఆర్చరీ మెన్స్ కాంపౌండ్ టీమ్ ఫైనల్లోలో అభిషేక్ వర్మ, ఓజాస్ డియోటాలే, ప్రథమేష్ జావ్కర్ స్టార్ ప్లేయర్లు.. 235-230 స్కోరుతో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో 21వ బంగారు పతకం వచ్చి చేరింది. అలాగే మొత్తం 84 పతకాలతో భారత్ టాప్ ఫోర్ లో కొనసాగుతుంది.

Next Story