2025ను ఘనంగా ముగించిన భారత మహిళల జట్టు.. శ్రీలంకతో సిరీస్ క్లీన్‌స్వీప్

by Gantepaka Srikanth |

శ్రీలంకపై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

2025ను ఘనంగా ముగించిన భారత మహిళల జట్టు.. శ్రీలంకతో సిరీస్ క్లీన్‌స్వీప్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ(Kerala)లోని తిరువనంతపురం(Thiruvananthapuram) వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో 160/7కు పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, అమన్‌జ్యోత్‌ కౌర్, శ్రీచరణి, స్నేహ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, రష్మిక, కవిషా దిల్హరి రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిమాషా మదుశనికి ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మ టీ20ల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా బౌలర్‌ మేగాన్ షట్‌ (151)ని అధిగమించి మహిళల టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది.

Next Story