- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND Women vs IRE Women : వన్డే క్రికెట్ లో భారత మహిళా జట్టు కొత్త రికార్డు
ఐర్లాండ్(India Women)తో జరుతున్న మూడో వన్డేలో భారత మహిళా(Ireland Women) క్రికెట్ జట్టు వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డును అందుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50ఓవర్లలో 435పరుగు రికార్డు స్కోరు సాధించింది

దిశ, వెబ్ డెస్క్ : ఐర్లాండ్(India Women)తో జరుతున్న మూడో వన్డేలో భారత మహిళా(Ireland Women) క్రికెట్ జట్టు వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డును అందుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50ఓవర్లలో 435పరుగు రికార్డు స్కోరు సాధించింది. కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) చెలరేగి (135, 80బంతుల్లో 12ఫోర్లు, 7సిక్సులు) మూడు వన్డేల ఈ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ..కేరీర్ లో 10వ సెంచరీ నమోదు చేసింది. భారత్ తరుపునా వేగవంతమైన వన్డే సెంచరీ సాధించింది.
ప్రతీకా రావల్ (Pratika Rawal) విజృంభించి (154, 129బంతుల్లో 20ఫోర్లు, 1సిక్స్ ) తో కేరీర్ లో తొలి శతకం నమోదు చేసుకుంది. ప్రతీకా సెంచరీని 100 బంతుల్లో సాధించగా,, మరో 27 బంతుల్లోనే ఇంకో అర్ధశతకం చేయడం విశేషం. తొలి వికెట్ కు మంధాన- ప్రతీకా రావల్ జోడీ 233 పరుగులు రాబట్టారు. మహిళల వన్డే చరిత్రలో ఆరో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యంగా నిలిచింది.
వన్ డౌన్ లో వచ్చిన రిచా ఘోష్ (59, 10 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడేసింది. ప్రతీకా, రీచా జంట 12ఓవర్లలో 104పరుగులు రాబట్టారు. తేజల్ హసబ్నిస్ (28)తో కలిసి ప్రతీకా మరో యాభై పరుగుల భాగస్వామ్యం నిర్మించింది. హర్లీన్ డియోల్ (15) పరుగులతో దూకుడుగా ఆడింది.
జెమిమా రోడ్రిగ్స్ 4, దీప్తి శర్మ 11పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఇదే సిరీస్ లో జనవరి 12న చేయడం విశేషం. ఇప్పుడు మరోసారి ఆ రికార్డును అధిగమించింది.






