ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

by Malleboina Mahesh |   (  Updated:2025-04-08 14:34:54  IST  )

శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత మహిళల జట్ల మధ్య ముక్కోణపు వన్డే సీరిస్ జరగనుంది. ఈ ట్రై సిరీస్ కోసం భారత మహిళల జట్టును బీసీసీఐ మంగళవారం ఉదయం ప్రకటించింది.

ముక్కోణపు వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక, దక్షిణాఫ్రికా, భారత మహిళల జట్ల మధ్య ముక్కోణపు వన్డే సీరిస్ (ODI Tri-series) జరగనుంది. ఈ ట్రై సిరీస్ కోసం భారత మహిళల జట్టు (Indian Women's Team)ను బీసీసీఐ (BCCI) మంగళవారం ఉదయం ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) కెప్టెన్ గా వ్యవహరించనుంది. అలాగే స్మృతి మంధాన (Smriti Mandhana) వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అత్యంత కీలకమైన ఈ సిరీస్ కోసం.. కౌర్, మందన‌తో పాటు, ప్రాటికా రావల్, హర్లీన్ డియోల్, జేమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ వంటి బ్యాటర్లను జట్టులోకి తీసుకున్నారు. అలాగే ఆల్ రౌండర్ల కోటాలో యాస్టికా భాటియా, దీప్తి శర్మ, అమన్జోత్ శర్మ, కేశ్వీ గౌతమ్ చోటు దక్కించుకున్నారు.

బౌలర్లుగా.. స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్, శ్రీ చరణి, సుచి ఉపాద్యాయ్ వంటి బౌలర్లకు చోటు కల్పించారు. మొత్తం 15 ప్లేయర్లతో భారత జట్టను ఈ రోజు బీసీసీఐ(BCCI) ప్రకటించింది. కాగా ఈ వన్డే ట్రై సిరీస్ (ODI Tri Series) ఈ నెల 27 నుంచి శ్రీలంక వేదికగా జరుగనుంది. మొదటి మ్యాచ్లో శ్రీలంక, భారత మహిళల జట్లు తలపడనున్నాయి. అలాగే రెండో మ్యాచులో సౌతాఫ్రికా జట్టుతో భారత జట్టు తలపడనుంది. మొత్తం ఆరు మ్యాచులు జరగనుండగా.. ఆరు మ్యాచుల తర్వాత టాప్ 2 లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ మే 11న కొలంబో వేదికగా జరుగనుంది.

Next Story