వరల్డ్ కప్‌తో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిని భారత మహిళల క్రికెట్ జట్టు

by Malleboina Mahesh |   (  Updated:2025-11-06 08:02:06  IST  )

ఈ నెల 2న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళ జట్టు విజయం సాధించింది. దీంతో దశాబ్దాల నాటి కలను సాకారం చేస్తూ.. ఉమెన్స్ టీం ప్రపంచ ఛాంపియన్స్ గా నిలిచింది.

వరల్డ్ కప్‌తో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిని భారత మహిళల క్రికెట్ జట్టు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 2న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళ జట్టు విజయం సాధించింది. దీంతో దశాబ్దాల నాటి కలను సాకారం చేస్తూ.. ఉమెన్స్ టీం ప్రపంచ ఛాంపియన్స్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత ఐసీసీ మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్‌గా భారత జట్టు ట్రోఫితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, "మేడమ్, ఈ టోర్నమెంట్ మాకు చాలా ప్రత్యేకమైనది. ఈ జట్టు గురించి గొప్ప విషయం ఏమిటంటే, ఈ టోర్నమెంట్ భారతదేశంలో జరుగుతుందని తెలుసుకున్న క్షణం, ఏది ఏమైనా, మన దేశం కోసం ఈ ట్రోఫీని గెలుస్తామని మేము నిర్ణయించుకున్నాము. ఈ రోజు మా జీవితంలోని అతిపెద్ద క్షణాన్ని మీతో పంచుకోవడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. మరోసారి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు మేడమ్. ఈ ట్రోఫీని మీకు అందించడం గర్వంగా ఉంది."అని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చారు.

Read More... విశ్వవిజేతలను కలిసిన ప్రధాని.. ధైర్యం, పట్టుదల ప్రదర్శించారని కితాబు

Next Story