- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో 3-2తో ఓడిన భారత అమ్మాయిలు
by Phanindra |
ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3-2తో భారత అమ్మాయిలు పోరాడి ఓడారు. రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచినా విజయం సాధించలేకపోయారు.

X
దిశ, స్పోర్ట్స్: భారత మహిళల హాకీ జట్టుకు ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో ఓటమి ఎదురైంది. లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూసింది. ఆసీస్ తరఫున కర్ట్‌నీ షోనెల్ (16వ నిమిషం), లెక్సీ పికెరింగ్ (26వ నిమిషం), టాటుమ్ స్టివార్ట్ (35వ నిమిషం) గోల్స్ చేశారు. భారత్‌కు దక్కిన పెనాల్టీ కార్నర్‌లను దీపిక, నేహా గోల్స్‌గా మలిచారు. అయితే ఆ తర్వాత ఆసీస్ డిఫెన్స్‌ను బ్రేక్ చేయడంలో భారత జట్టు విఫలమైంది. చివరి క్వార్టర్‌లో కూడా భారత్‌కు మరో రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ వాటిని గోల్స్‌గా మలచడంలో భారత అమ్మాయిలు ఫెయిలయ్యారు. దీంతో ఎంత పోరాడినా భారత్‌కు ఓటమి తప్పలేదు.
Next Story






