ఏఎఫ్‌సీ మహిళల ఏసియన్ కప్‌లో టఫ్ గ్రూపులో భారత్!

by Phanindra |

ఏఎఫ్‌సీ మహిళల ఏసియన్ కప్‌లో భారత్ టఫ్ గ్రూపులో చేరింది. జపాన్, చైనా, వియత్నాంతో కలిసి గ్రూప్-సిలో తలపడనుంది.

ఏఎఫ్‌సీ మహిళల ఏసియన్ కప్‌లో టఫ్ గ్రూపులో భారత్!
X

దిశ, స్పోర్ట్స్: ఏఎఫ్‌సీ మహిళల ఏసియన్ కప్‌లో భారత జట్టు టఫ్ గ్రూపులో నిలిచింది. తాజాగా తీసిన డ్రాలో టాప్ ఏసియన్ టీం జపాన్, మాజీ ఛాంపియన్ చైనీస్ తైపీ, వియత్నాంతో కలిసి గ్రూప్-సిలో ఉంది. 12 జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2026 మార్చ్ 1 నుంచి 21 వరకు ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. భారత జట్టు మార్చ్ 4న వియత్నాంతో తొలి మ్యాచ్ ఆడనుంది.

ఆ తర్వాత మార్చ్ 7న జపాన్‌తో, 10వ తేదీన చైనీస్ తైపీతో తలపడుతుంది. మిగతా రెండు గ్రూప్స్‌లో ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్ జట్లు గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్‌-బిలో నార్త్ కొరియా, చైనా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ టీమ్స్ ఉన్నాయి.

ఈ టోర్నీలో సెమీస్ చేరుకునే నాలుగు జట్లు.. 2027లో బ్రెజిల్ వేదికగా జరిగే మహిళల ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిన జట్లు కూడా మరో రెండు వరల్డ్ కప్ బెర్తుల కోసం ప్లేఆఫ్స్‌లో తలపడతాయి. ఈ టోర్నీలో తలపడే టాప్ టీం జపాన్. ఫిఫా ర్యాకింగ్స్‌లో జపాన్ 7వ ర్యాంకులో ఉంది. ఫిఫా చార్ట్‌లో వియత్నాం 37వ ర్యాంకులో, చైనా 42వ స్థానంలో ఉండగా.. భారత్ ఏకంగా 70వ ప్లేస్‌లో ఉంది.

Next Story