న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. రోహిత్, కోహ్లీకి చోటు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-03 12:07:14  IST  )

త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఎవరూ ఉహించిన విధంగా యువ ప్లేయర్ శుభ్ మాన్ గిల్‌ను నియమించింది.

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.. రోహిత్, కోహ్లీకి చోటు
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టు (Indian team)ను ప్రకటించింది. ఈ జట్టుకు ఎవరూ ఉహించిన విధంగా యువ ప్లేయర్ శుభ్ మాన్ గిల్‌ (Shubhman Gill)ను నియమించింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కింది. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా, రిషబ్ పంత్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే, వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. మహమ్మద్ షమీ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, సెలక్టర్లు సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కే మొగ్గు చూపారు.

వన్డే జట్టులో యువ రక్తం

బీసీసీఐ ప్రకటించిన ఈ వన్డే జట్టులో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లకు చోటు లభించింది. యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లతో భారత జట్టు బలంగా కనిపిస్తుంది. మొత్తం మూడు వన్డేలు జరగనుండగా.. తొలి మ్యాచ్ జనవరి 11న వడోదరలో, రెండో మ్యాచ్ జనవరి 14న రాజ్‌కోట్‌లో, చివరి మ్యాచ్ జనవరి 18న ఇండోర్‌లో నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు ఈ సిరీస్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది.

భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.

Next Story