Ind vs Eng: టీమిండియా కొత్త ఫార్ములా..మొదటి టెస్ట్ కోసం ఏకంగా 5 గురు బౌలర్లు!

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 ) టోర్నమెంట్ పూర్తికాగానే... టెస్ట్ మూడ్ లోకి టీం ఇండియా వెళ్ళింది. ఇండియా (

Ind vs Eng: టీమిండియా కొత్త ఫార్ములా..మొదటి టెస్ట్ కోసం ఏకంగా 5 గురు బౌలర్లు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 ) టోర్నమెంట్ పూర్తికాగానే... టెస్ట్ మూడ్ లోకి టీం ఇండియా వెళ్ళింది. ఇండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య మరో మూడు రోజుల్లోనే ఐదు టెస్టుల సిరీస్ (Five Test Series) ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్ కోసం గిల్ సారధ్యంలో టీమిండియా.... ఇంగ్లాండ్ కు వెళ్ళింది. ఇప్పటికే ఇంగ్లాండు వెళ్లిన టీమిండియా... ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.

ఇక జూన్ 20వ తేదీ నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం అవుతుంది. లీడ్స్ వేదికగా... మొదటి టెస్ట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు టెస్ట్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం ఏకంగా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగబోతోంది టీం ఇండియా.

ఇందులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్ బౌలర్లు ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదా ఒకే ఒక్క స్పిన్నర్ ను తీసుకొని... నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది. హర్షిత్ రానా ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉన్నాడు. అతడు టీమిండియా జట్టులో 19వ ప్లేయర్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉండాలన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు భారీ ప్లాన్ చేస్తోంది టీమిండియా.

Next Story